బాలకృష్ణ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన శ్రుతిహాసన్?

17 May, 2021 20:16 IST|Sakshi

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తయిన వెంటనే బాలకృష్ణ  గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో కథానాయుకగా శ్రుతిహాసన్ ఫైనల్‌ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గోపిచంద్‌ మలినేని డైరెక‌్షన్‌లో వచ్చిన 'బలుపు', 'క్రాక్' సినిమాల్లో శ్రుతినే హీరోయిన్‌గా చేసింది.

ఆ రెండు సినిమాలు హిట్‌ కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో మరోసారి శ్రుతిని సంప్రదించారని, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు  సమాచారం​. దీంతో మరోసారి శ్రుతితో హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అయ్యారట గోపిచంద్‌ మలినేని. బాలకృష్ణ చేస్తున్న అఖండ షూటింగ్‌ జులైలో పూర్తి కానుందట. ఈ మూవీ పూర్తయిన వెంటనే గోపిచంద్‌తో సినిమా చేయనున్నారు బాలయ్య. అటు శ్రుతి హాసన్‌ కూడా ప్రభాస్‌ సరసన సలార్‌ అనే పాన్‌ఇండియా మూవీలో నటిస్తుంది. 

చదవండి : బాలయ్యను చూసి ఆశ్చర్యపోయా: ప్రగ్యా జైస్వాల్‌
కరోనా కష్టకాలంలో నెటిజన్‌కు నవీన్‌ పొలిశెట్టి సర్‌ప్రైజ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు