Shruti Haasan : శాంతను అలాంటివాడు.. బాయ్‌ఫ్రెండ్‌పై శ్రుతిహాసన్‌ కామెంట్స్‌

27 Feb, 2023 16:08 IST|Sakshi

హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ మధ్య కెరీర్‌ కాస్త అదుపు తప్పినా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే శ్రుతి తన పర్సనల్‌ విషయాలను ఎప్పడూ సీక్రెట్‌గా ఉంచలేదు. 

బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికతో రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్న శ్రుతిహాసన్‌ అతనితోనే కలిసి ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. సమయం వచ్చినప్పుడల్లా ప్రియుడు శాంతనుతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంది.

తాజాగా మరోసారి శాంతను గురించి ఆమె చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 'నాకు బయటకు వెళ్లి తినడం అంటే చాలా ఇష్టం. నేను, శాంతను తినడం కోసం బతుకుతుంటాం. తినే టైంలో ఎన్నో విషయాలు చర్చించుకుంటాం. నాలాగే భోజన ప్రియుడ్ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. తను నా లైఫ్‌లోకి వచ్చినందుకు నేనంతో లక్కీ' అంటూ బాయ్‌‍ఫ్రెండ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. 

మరిన్ని వార్తలు