బిగ్‌ బాస్‌కి హోస్ట్‌గా శ్రుతీహాసన్‌!

25 Nov, 2021 05:25 IST|Sakshi

తమిళ ‘బిగ్‌ బాస్‌’ షోకి హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం ‘బిగ్‌ బాస్‌’ 5వ సీజన్‌ నడుస్తోంది. ఈ షోకి నటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్‌తో కమల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాత ఎవరు ఉంటారనే చర్చ జరుగుతోంది.

కమల్‌ స్థానంలో ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌ను తీసుకోవాలని ‘బిగ్‌ బాస్‌’ నిర్వాహకులు అనుకున్నారట. శ్రుతీని సంప్రదించారని కూడా టాక్‌. ఆమె కూడా షోను హోస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపించినట్లు భోగట్టా. కాగా ‘బిగ్‌ బాస్‌’ తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టులో హీరో సూర్య, నటి రమ్యకృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. మరి కమల్‌ ‘బిగ్‌ బాస్‌’కి వచ్చేవరకూ ఎవరు హోస్ట్‌ చేస్తారనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు