Shruti Hassan: అది కేవలం ఇండస్ట్రీలోనే కాదు, సమాజమే అలా ఉంది

12 Aug, 2022 09:21 IST|Sakshi

శ్రుతి హాసన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పాన్‌ ఇండియా చిత్రం సలార్‌, బాలకృష్ణ సరసన ఎన్‌బీకే107, చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించి శ్రుతీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.  ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారా? అని యాంకర్‌ అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చింది. కానీ, పురుషాధిక్యత అనేతి కేవలం సినీ పరిశ్రమలోనే లేదని, సమాజమే అలా ఉందని చెప్పుకొచ్చింది. 

చదవండి: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్‌కు వెళ్లింది!: నాగార్జున

‘నిజం చెప్పాలంటే ప్రస్తుతం మనం పురుషుల ఆధిపత్యం ఉన్న సమాజంలోనే జీవిస్తున్నాం అనిపిస్తోంది. ఇది కేవలం ఇండస్ట్రీలోనే ఉందంటే నేను అంగీకరించను. ఎక్కడ చూసిన పురుషుల ఆధిపత్యమే ఉంది. ఈ సమాజామే అలా ఉంది’ అని వివణ ఇచ్చింది. అనంతరం తన సినీ కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. మనం చూసే కథలకు ప్రతిబంబమే సినిమా అని, తన ఒక నటిగా కళ జీవితాన్ని అనుసరిస్తున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం శ్రుతి సలార్‌, ఎన్‌బీకే107 చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఇక త్వరలోనే ఆమె వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. 

మరిన్ని వార్తలు