Shruthi Haasan: మా ఇల్లే పాన్‌ ఇండియా

11 Jan, 2023 04:35 IST|Sakshi

శ్రుతీహాసన్‌ ఏదీ ప్లాన్‌ చేయరు. సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఇన్నేళ్లు ఉండాలని ΄్లాన్‌ చేయలేదు. సినిమాకి దూరం కాకూడదనుకుంటారు. అంతే.. ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’, గోపీచంద్‌ దర్శకత్వంలో బాలకృష్ణతో చేసిన ‘వీరసింహారెడ్డి’తో ఈ సంక్రాంతికి డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారామె. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ ఈ 12న, 13న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్‌ కానున్నాయి. ఈ సందర్భంగా శ్రుతి చెప్పిన విశేషాలు..

రెండు చిత్రాలతో మీతో మీరే పోటీ పడటం ఎలా ఉంది?
నిజానికి ఇది ఊహించలేదు. తొమ్మిదేళ్ల క్రితం నా రెండు సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. అయితే పండగప్పుడు కాదు. ఫెస్టివల్‌ టైమ్‌లో రెండు పెద్ద చిత్రా లతో.. ఇద్దరు లెజెండరీ (చిరంజీవి, బాలకృష్ణ) హీరోల సినిమాలతో రావడం ఆశీర్వాదం అనుకుంటున్నా. 

రెండు సినిమాలూ హిట్టవ్వాలనే ఓ టెన్షన్‌ ఉంటుంది కదా...
టెన్షన్‌ అనేది సెట్లో పని చేస్తున్నప్పుడు మాత్రమే. ఎక్స్‌ప్రెషన్‌ సరిగ్గా వచ్చిందా? లేదా డైలాగ్‌ బాగా చెప్పానా? లేదా అనే టెన్షన్‌ ఉంటుంది. సెట్‌ నుంచి బయటికొచ్చేస్తే టెన్షన్‌ ఉండదు. ఎందుకంటే మిగతాదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. 

‘వాల్తేరు..’, ‘వీరసింహా...’లలో ఏ సినిమాలో మీ పాత్ర బాగుంటుందనే పోలిక రావడం సహజం.. 
నిజమే. అయితే రెండు సినిమాల కథలు, ΄ాత్రలు, ట్రీట్‌మెంట్‌ భిన్నంగా ఉంటాయి. నా ΄ాత్రలు డిఫరెంట్‌గా, సవాల్‌గా ఉంటాయి. ‘వీరసింహా..’లో నా ΄ాత్ర కామెడీగా ఉంటుంది. కామెడీ చేయడం కష్టం. ‘వాల్తేరు...’లో నా ΄ాత్రని బాగా రాశారు.  

చిరంజీవి, బాలకృష్ణలతో డ్యాన్స్‌ చేయడం...
నైస్‌ ఎక్స్‌పీరియన్స్‌. ‘వీరసింహారెడ్డి’లోని ‘సుగుణసుందరి...’ స్టెప్‌ బాగా రీచ్‌ అయ్యింది. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లోని ‘శ్రీదేవి... చిరంజీవి’ పాట కూడా అద్భుతంగా వచ్చింది. 

ఒక పాట మంచి ఎండ (సుగుణ సుందరి)లో.. మరో పాట (నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరు) విపరీతమైన చలిలో చేసిన అనుభవం గురించి?
ఇండియన్స్‌కి ఎండ సమస్య కాదు. కానీ చలి తట్టుకోవడం కష్టం. పైగా పల్చటి చీరలో మైనస్‌ 11 డిగ్రీల చలిలో చేయాల్సి వచ్చింది. 
 
ఈ విషయంలో హీరోయి న్లకే సమస్య. హీరోలు ఫుల్‌గా కవర్‌ చేసుకునే వీలు ఉంటుంది...
యూనిట్‌ అంతా నాలుగైదు లేయర్ల కోట్స్‌ వేసుకుంటే మేం చలిలో డ్యాన్స్‌ చేశాం (నవ్వుతూ). సార్‌ (చిరంజీవి) కూడా పెద్దగా కవర్‌ చేసుకోలేదు. ఒక కోట్‌.. అంతే. 

‘వీరసింహారెడ్డి’ వేడుకలో ΄పాల్గొన్న మీరు ‘వాల్తేరు వీర య్య’ వేడుకలో ΄పాల్గొనలేదు.. కారణం?
ఆరోగ్యం బాగాలేదు. పూర్తిగా రికవర్‌ కాకపోవడంతో వేడుకకు వెళ్లలేకపోయా. ఐయామ్‌ సో సారీ.

ఆ మధ్య మీకు తెలుగులో గ్యాప్‌ వచ్చింది... ఇప్పుడు ఇద్దరు సీనియర్‌ హీరోలతో, యంగ్‌ హీరో ప్రభాస్‌తో ‘సలార్‌’.. వరుసగా సినిమాలు చేయడం ఎలా ఉంది?
మా ఇంట్లో మా అమ్మానాన్నని చూసి సినిమా అనేది ఫ్యామిలీ అనిపించింది. ఇక ఇండస్ట్రీ, ఆడియన్స్‌ పరంగా తెలుగు నాకు రియల్‌ ఫ్యామిలీ అంటాను. ఎందుకంటే సౌత్‌లో నేను పరిచయం అయింది తెలుగు సినిమాల ద్వారానే. ఒక కొత్త ప్రాంతంలో నాకు మంచి ఆహ్వానం దక్కింది. ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. హిట్‌ ఇచ్చారు. ‘క్రాక్‌’ తర్వాత మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది.

సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ?
‘సంక్రాంతి’ అనే పదం నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతే నా లైఫ్‌లోకి వచ్చింది. మాకు తమిళ్‌లో ‘పొంగల్‌’ అంటాం. పండగ రోజు ΄పొంగలి వండుతాను. పూజ చేస్తాను. ఫ్యామిలీతో గడుపుతాను.

గోపీచంద్‌ మలినేని మిమ్మల్ని లక్కీ హీరోయిన్‌ అంటారు. లక్‌ని మీరు నమ్ముతారా? 
లేదు.. హార్డ్‌ వర్క్‌ని, దేవుడిని నమ్ముతాను. ఒకవేళ ఎవరైనా నన్ను లక్కీ అంటే వాళ్లకు థ్యాంక్స్‌ చెబుతాను. అయితే నేను లక్, అన్‌లక్‌ని నమ్మను. ఎందుకంటే ఒకప్పుడు నన్ను ‘అన్‌లక్కీ’ అన్నారు. ఆ తర్వాత ‘లక్కీ’ అన్నారు. వేరేవాళ్లు నన్ను అలా అనడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను.  

మరిన్ని వార్తలు