బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ

6 Nov, 2021 09:15 IST|Sakshi

హీరో బాలకృష్ణ సరసన శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా శ్రుతీహాసన్‌ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘ఫుల్‌ మాస్‌ మసాలా చిత్రమిది. వాస్తవ ఘటనలతో గోపీచంద్‌ ఈ కథ రాశారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌. 

మరిన్ని వార్తలు