సలార్‌లో శృతీహాసన్‌ పాత్ర ఇదే..

20 Apr, 2021 05:44 IST|Sakshi

ప్రశ్నించడం ఎలానో తెలుసుకున్నారట శ్రుతీహాసన్‌. ఇప్పుడు ప్రశ్నించే పని మీదే ఉన్నారట. ఇంతకీ ఎవర్ని ప్రశ్నిస్తున్నారంటే ‘సలార్‌’ సినిమా చూడాల్సిందే. ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్‌’. ఇందులో శ్రుతీహాసన్‌ పొలిటికల్‌ జర్నలిస్ట్‌ పాత్ర చేస్తున్నారని సమాచారం. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి జర్నలిస్ట్‌లు ఎలా ప్రశ్నిస్తారు? వారి తీరు ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుని, చిత్రీకరణలో పాల్గొంటున్నారట. తొలిసారిగా ప్రభాస్‌–శ్రుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇది.

చదవండి: మోసం అంటున్న అనుపమ, లేపేస్తా అంటున్న ప్రగ్యా

మరిన్ని వార్తలు