2021లో శృతిహాసన్‌ పెళ్లి?: హీరోయిన్‌ రిప్లై

24 Jan, 2021 13:14 IST|Sakshi

క్రాక్‌లో మాస్‌ యాంగిల్‌లో నటించి ప్రేక్షకులతో ఈలలు కొట్టించుకుందీ శృతి హాసన్‌. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయని, డ్యాన్సర్‌, సంగీత దర్శకురాలు, నిర్మాత.. ఇలా అన్ని రంగాల్లోనూ ఆమెది అందె వేసిన చేయి. తాజాగా ఆమె అభిమానులతో సోషల్‌ మీడియాలో చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెపై ప్రశ్నల బాణాలను సంధించారు. వీటన్నింటికీ ఆమె ఓపికగా సమాధానాలు చెప్పారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారా అన్న ప్రశ్న ఆమెకు మరోసారి ఎదురైంది. దీనికి ఈ బ్యూటీ ముమ్మాటికీ జరగడం లేదని తేల్చి చెప్పింది. తర్వాత ఓ అభిమాని మీరు మీ మాజీ ప్రియుడు మైఖెల్‌ను అసహ్యించుకుంటున్నారా? అని అడిగాడు. (చదవండి: ‘గాలి సంపత్’ కోసం రంగంలోకి అనిల్‌ రావిపూడి)

ఈ ప్రశ్న విని ఓ క్షణంపాటు ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే తేరుకుని 'మీరు నిజంగా చెడ్డవాళ్లు. అసలు నేను ఎవరినీ అసహ్యించుకోను. కాబట్టి నా సమాధానం లేదు అనే వస్తుంది. కాకపోతే లోలోపల కొంత బాధపడుతాను' అని చెప్పుకొచ్చింది. మీరు ముక్కుకు సర్జరీ చేయించుకున్నారా? అన్న ప్రశ్నకు అవునని, కానీ ఇదెప్పుడో ఏడేళ్ల క్రితం జరిగిందని, ఇంకా దాన్నే పట్టుకుని వేలాడటం ఆపేయండని సూచించింది. క్రాక్‌ ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనడం లేదన్న క్వశ్చన్‌కు బిజీగా ఉన్నానని బదులిచ్చింది. 'నిజానికి ఆ సినిమా రిలీజ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశా. కానీ ఎప్పుడు విడుదలవుతున్నందానిపై నాకు సమాచారం లేదు. పైగా నేనే వేరే షూటింగ్‌లో ఉన్నాను. కానీ ఆ చిత్రం నాకు చాలా సంతోషాన్నిచ్చింది' అని పేర్కొంది. ఇదిలా వుంటే శృతి పవన్‌ ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ సరసన వకీల్‌ సాబ్‌లో నటిస్తోంది. ఈ చిత్రం హిందీ పింక్‌కు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. (చదవండి: షూటింగ్‌లో గుక్కపెట్టి ఏడ్చిన నటి)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు