లాక్‌డౌన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతీ రచ్చ, పోస్టు వైరల్‌

12 May, 2021 20:49 IST|Sakshi

డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో శ్రుతీహాసన్‌ ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది శ్రుతీ బర్త్‌డేకి శాంతను పెట్టిన పోస్టులు, ముంబై రోడ్లపై వీరిద్దరూ జంటగా చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. ఇక శ్రుతీ తాజా పోస్టు చూస్తే తప్పకుండా వీరిద్దరూ అవ్‌బర్డ్స్‌ అని ఒప్పుకొక తప్పదు. లాక్‌డౌన్‌లో శాంతానుతో కలిసి ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. శ్రుతీ, తన రూమర్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌ శాంతనుపై కుర్చోని అతడి బుక్కలు గిల్లుతూ, లాగుతూ నానా రచ్చ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రుతీ ‘బెస్టీతో లాక్‌డ్‌న్‌’ అంటూ షేర్‌ చేసింది. ప్రస్తుతం శ్రుతీ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్‌ వీడియో చేయడానికి రెడీ అయ్యారట. కొంతకాలంగా మ్యూజిక్‌ కంపోజింగ్‌ మీద కూడా శ్రుతి బాగా దృష్టిపెట్టిన శ్రుతీ లండన్‌లో కొన్ని షోలు కూడా చేశారామె. తాజాగా శ్రుతి చేస్తున్న మ్యూజిక్‌ వీడియోలో శాంతను ర్యాప్‌ పాడనున్నారట. ఇంతకుముందు ర్యాపర్‌గా కొన్ని పాటలు పాడిన అనుభవం శాంతనుకు ఉంది. దీంతో వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్‌ వీడియో చేయడానికి సిద్దమయ్యారు. 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

చదవండి: 
కొత్త ఇంటికి మారిన బిగ్‌బాస్‌ భామ​ అరియాన 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు