Shruti Haasan: ‘ఒక్క సినిమా కంటే ఎక్కువ చేస్తాననుకోలేదు.. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని’

25 Jul, 2022 16:20 IST|Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రుతి హాసన్‌. తొలుత హిందీలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత దక్షిణాదిన అడుగుపెట్టింది. నటిగానే గాయనిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, వ్యాఖ్యాతగా తనలోని విభిన్న కోణాలతో అభిమానులను మెప్పించింది. కాగా శ్రుతీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు, ఇండస్ట్రీఇక ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఒక సినిమాకంటే ఎక్కువ చేస్తాననుకోలేదని వ్యాఖ్యానించింది.

చదవండి: మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్‌.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు

‘13 ఏళ్లు.. అద్భుతంగా ఉంది. అసలు ఒక్క సినిమా కంటే ఎక్కు చస్తానని అనుకోలేదు. దీని కోసమే పుట్టకపోయిన సినిమాను ప్రేమించడం నేర్చుకున్నాను.ఇండస్ట్రీకి, ఫ్యాన్స్‌కి నేను రుణపడి ఉన్నాను. నిజానికి నేను ఎప్పటికి రుణపడే జీవితాన్ని ఇండస్ట్రీ నాకిచ్చింది. ఇన్నేళ్లుగా ఎన్నో నేర్చుకున్నాను. గెలుపు, ఓటమిలను ఎలా తీసుకోవాలి, ఆత్మస్థైర్యంతో ఎలా ముందుకెళ్లాలి, కథలను చెప్తున్న వారిని ఎలా అభినందించాలి, ఎప్పుడూ కలవని మనుషులతో ఎలా మెలగాలి. నేను పొందుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీ దీనిని తేలికగా తీసుకోను. నేను మీకు దీనికంటే ఎక్కువే ఇవ్వాలని కోరుకుంటున్నాను.

చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న రణ్‌బీర్‌ షంషేరా మూవీ, ఎప్పుడు.. ఎక్కడంటే

నా ఈప్రయాణంలో నా ప్రేమ, అప్యాయతలను, మద్దతును ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదలు. నా రీర్‌లో ఈ 13 ఏళ్లకు చాలా థాంక్స్’ అంటూ రాసుకొచ్చింది. తన నటించిన ఈనాడు మూవీతో సింగర్‌గా సౌత్‌ ఇండస్ట్రీకి పరిచమైన శ్రుతి.. సిద్ధార్థ్‌ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత 7th సెన్స్‌ , ఓ మై ఫ్రెండ్‌ చిత్రాల్లో నటించి ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అంతేకాదు ఆమె వరుస చిత్రాలు ఫ్లాప్‌గా కావడంతో ఆమెను ఐరన్‌ లెగ్‌ అంటూ ట్రోల్‌ చేశారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో నటించిన గబ్బర్‌ సింగ్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాతో ఆమె తొలి కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. దీంతో ఆమె రాత్రిరాత్రే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

మరిన్ని వార్తలు