శ్రుతి బయోపిక్‌ జ్వాలాముఖి

13 Dec, 2020 00:33 IST|Sakshi

మీ బయోపిక్‌కి ఏం టైటిల్‌ పెడతారు? అని అడిగితే, ‘జ్వాలాముఖి’ అన్నారు శ్రుతీహాసన్‌. అంటే... భవిష్యత్తులో శ్రుతి జీవితాన్ని వెండితెరపై చూసే అవకాశం ఉందని ఊహించవచ్చు. వారాంతంలో అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్‌ చాట్‌ చేశారు శ్రుతీహాసన్‌. అప్పుడు ఓ ఫ్యాన్‌ ‘మీ బయోపిక్‌ టైటిల్‌ ఏంటి’ అంటే, ‘జ్వాలాముఖి’ అన్నారామె. ఇంతకీ ఈ బ్యూటీ జీవితంలో ఓ బయోపిక్‌కి కావాల్సినంత మసాలా ఉందా? అంటే.. విలక్షణ నటుడు కమల్‌హాసన్, నటి సారికల కూతురిగా శ్రుతీది గోల్డెన్‌ స్పూన్‌ అయినప్పటికీ, తల్లిదండ్రులకు ఉన్న పేరు వల్ల చిన్నప్పుడు స్వేచ్ఛ కోల్పోయారు.

సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కమల్‌లా మంచి యాక్టరేనా? అనే కామెంట్లు ఒకటి. సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రుతి ప్రతి పాత్రనూ సవాల్‌గా తీసుకుని చేసి, అనుకున్నది సాధించారు. కెరీర్‌ ఆరంభంలో కొన్ని సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ‘ఐరన్‌ లెగ్‌’ అన్నారు కొందరు. అలానే లవ్, బ్రేకప్‌ వంటివి కూడా ఉన్నాయి. నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో శ్రుతి బయోపిక్‌ తీస్తే అప్పటి విశేషాలు, ఇప్పటివరకూ జరిగినవి కలిపితే ఓ మంచి సినిమా తయారవుతుందని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు