ఒంటిపై ఉన్న టాటూ కనిపించేలా ఘాటు ఫోజులు.. ఇదే శృతి హాసన్‌ రహదారి అట

21 Nov, 2023 10:16 IST|Sakshi

నటి శృతిహాసన్‌ ఎప్పుడూ సంచలనమే. లోక నాయకుడు కమలహాసన్‌ వారసురాలు అయిన ఈమె ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉండడానికి ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. హిందీ చిత్రం లక్‌ ద్వారా కథానాయికగా పరిచయమైనా ఆ తర్వాత దక్షిణాది చిత్రాలకే పరిమితమయ్యారు. అలా ధనుష్‌ కు సరసన 3, సూర్య జంటగా 7ఆమ్‌ అరువు వంటి చిత్రాల్లో నటించి పాపులర్‌ అయ్యారు. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా విజయాలను అందుకున్నది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమంలోనే. తాజాగా ప్రభాస్‌కు జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం కోసం యావత్‌ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22వ తేదీ ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. కాగా ప్రస్తుతం ది ఐ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్‌ నెటిజన్లను ఖుషి చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి వార్తల్లో నిలిచారు.

తాజాగా ఆమె పేరుతో కూడిన టాటూను ఒంటిపై కనిపించేలా తీసుకున్న ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో తాను అన్నింటిని మరచి బయటకు రావాలని కోరుకుంటున్నానని, ఇకపై తాను లేచి నిలబడడం నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. తన విషయాలను తన స్టైల్‌లో చేస్తానని ఇది తన రహదారి లేదా బైపాస్‌ అని శృతిహాసన్‌ పేర్కొన్నారు. దీంతో శృతిహాసన్‌ మాటల్లో అర్థం ఏమిటి రామా అంటూ ఆమె అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

మరిన్ని వార్తలు