అప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా: స్టార్‌ హీరోయిన్‌

16 Aug, 2021 08:31 IST|Sakshi

హీరోయిన్‌ శృతి హాసన్‌ ప్రస్తుతం ‘సలార్‌’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. శృతి నటిగా కంటే ముందు ఇండస్ట్రీకి గాయనీగా పరిచయమైన సంగతి తెలిసిందే. తన తండ్రి, విలక్షణ నటుటు కమల్‌ హాసన్‌ ‘ఈనాడు’ సినిమాలో ఆమె ఓ పాట పాడింది. ఆ తర్వాత కమల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హేరామ్‌’ మూవీలో అతిథిగా పాత్రలో కనిపించి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా నటిగా తన జర్నీని స్టార్ట్‌ చేసిన శృతికి సంగీతం అంటే ప్రాణమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చింది. మ్యూజిక్‌ మీద ఆసక్తితోనే తను సినిమాల్లోకి వచ్చానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజిక్‌ అంటే ఇష్టం ఉన్న శృతి హీరోయిన్‌గా ఎలా మారిందో వివరించింది. ‘కాలేజీలో ఉన్నప్పుడు రాక్‌స్టార్‌ అవ్వాలని కలలు కనేదాన్ని. ఎలాగైన సొంతంగా ఒక రాక్‌బ్యాండ్‌ నడపాలి అనుకున్న. అయితే బ్యాండ్‌ నడపాలంటే డబ్బు కావాలి. అప్పడు నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే రెండు, మూడు సినిమాలు చేసి ఆ డబ్బుతో బ్యాండ్‌ స్టార్ట్‌ చేసి సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్న. కానీ ఇక్కడకు వచ్చాక నాకు తెలియకుండానే నటనను ఇష్టపడ్డాను. మెల్లిగా సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఇండస్ట్రీయే నా ప్రపంచం అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది.

అయితే తను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న సంగీతాన్ని మాత్రం వదిలి పెట్టలేదని, విరామం దొరికినప్పుడు తన సమయం మ్యూజిక్‌కు కేటాయిస్తానని ఆమె పేర్కొంది. కాగా ప్రస్తుతం శృతి తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతానుతో కలిసి మ్యూజిక్‌ మొదలు పెట్టె ప్లాన్‌లో ఉన్నట్లు తెలిపింది. అయితే మీ తండ్రి పెద్ద స్టార్‌ కదా ఆయన దగ్గర డబ్బు ఎందుకు తీసుకోలేదని అడగ్గా.. తనకు సొంతగా ఎదగడం ఇష్టమని, అది తన కల, తాను సొంతంగా సంపాదించిన డబ్బుతోనే కలను నిజం చేసుకోవాలనుకున్నానని శృతి తెలిపింది. 

మరిన్ని వార్తలు