కె విశ్వనాథ్ సతీమణి మృతి బాధాకరం: శ్యామలా దేవి సంతాపం

27 Feb, 2023 18:54 IST|Sakshi

కె. విశ్వనాథ్‌ కన్నుమూసిన మూడు వారాల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మీ కూడా మరణించారని తెలిసి చాలా బాధేసిందని కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలా దేవి అన్నారు. 'తండ్రిని కోల్పోయి బాధలో మునిగిపోయిన ఆ పిల్లలకు తల్లి కూడా దూరం అవడం అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. కృష్ణంరాజు గారు ఆమెను మాతృ సమానురాలిగా గౌరవించేవారు.

అలాంటి జయలక్ష్మీ గారు మనల్ని విడిచి వెళ్లి పోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా' అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. కాగా అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విశ్వనాథ్‌ సతీమణి ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగిందని తెలిసి చాలా సంతోషించానని కృష్ణంరాజు  సతీమణి శ్యామలా దేవి అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలు అవార్డులతో సత్తా చాటిన రాజమౌళి మార్క్ చిత్రం ఆర్ఆర్ఆర్ తాజాగా హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల్లో  ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టి భారత సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే.

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’, ‘ఉత్తమ యాక్షన్ చిత్రం’, ‘ఉత్తమ స్టంట్స్’, ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అవార్డులు గెలిచి తెలుగు సినిమా సత్తా చాటింది.  అయితే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయంతో ఆస్కార్‌ కూడా మనకు దగ్గరలోనే ఉందని నాకనిపోస్తోంది. ఈ ఘనత సాధించిన రాజమౌళికి, చిరంజీవులు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు నా శుభాభినందనలు. సంగీతం అందించిన కీరవాణి  సహా సినిమా కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలుఅంటూ  ఆమె పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు