13న తెరపైకి యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రంగా’ 

10 May, 2022 13:09 IST|Sakshi

తమిళ సినిమా: నటుడు సిబిరాజ్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం రంగా. నిఖిలా విమల్‌ నాయికగా, డీఎల్‌ వినోద్‌ను దర్శకుడిగా బాస్‌ మూవీ పతాకంపై విజయ్‌ కె.చెల్లయ్య నిర్మించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సిబిరాజ్‌ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి సిద్ధమయ్యానన్నారు.

షూటింగ్‌ అధికభాగం కశ్మీర్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారన్నారు. కథ బావుంది గానీ.. కొత్త దర్శకుడు ఎలా తెరకెస్తారన్న సంశయం కలిగిందన్నారు. దీంతో కొన్ని రోజులు చెన్నైలో షూటింగ్‌ చేసి దర్శకుడి ప్రజెంటేషన్‌ చూసిన తర్వాత కశ్మీర్‌కి వెళ్దామని నిర్మాతకు చెప్పానన్నారు. కానీ  కథకు తగిన వాతావరణం ఇప్పుడు కశీ్మర్‌లో ఉంటుందని అక్కడే షూటింగ్‌ చేద్దామని ఆయన చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు