Chithha Movie Update: సిద్ధార్థ్ నయా మూవీ.. అలాంటి కాన్సెప్ట్

27 Sep, 2023 16:04 IST|Sakshi

సిద్ధార్థ్‌ హీరోగా నటించి నిర్మించిన సినిమా 'చిత్తా'. ఎస్‌.యం అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిమిషా సజయన్‌, అంజలి నాయర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో గురువారం విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?)

ఈ సందర్భంగా సోమవారం చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ఇది నిర్మాతగా తన తొలి చిత్రం అని చెప్పాడు. నిర్మాతగా మారాలనుకున్నప్పుడు రాజీ పడకుండా సహజత్వంతో కూడిన మంచి కథ చిత్రం చేయాలని అనుకున్నాను. 

అలానే ప్రీ ప్రొడక్షన్‌ కోసమే సుమారు రెండేళ్లు టైమ్ తీసుకున్నట్లు చెప్పాడు. సినిమాలోని చాలా సన్నివేశాలని పళనిలో లైవ్‌గా చిత్రీకరించినట్లు సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. 'చిత్తా' మూవీని చూసి తన యాక్టింగ్‌ని ప్రశంసించిన సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్‌ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!)

మరిన్ని వార్తలు