అలాంటి వారికి సమాధానమే టక్కర్‌

30 May, 2023 03:59 IST|Sakshi
వివేక్‌ కూచిభొట్ల, కార్తీక్‌ జి. క్రిష్, సిద్ధార్థ్, మయాంక్‌

– హీరో సిద్ధార్థ్‌

‘‘మీరెప్పుడూ లవర్‌ బోయ్‌ పాత్రలు చేస్తుంటారు. కంప్లీట్‌ కమర్షియల్‌ సినిమా చేయొచ్చు కదా?’ అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. వారికి సమాధానమే ‘టక్కర్‌’. ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ టచ్‌తో ఈ ప్రేమకథ నడుస్తుంది’’ అన్నారు సిద్ధార్థ్‌. కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్‌ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ప్యాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ– ‘‘బాయ్స్‌’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్‌ పూర్తవుతుంది. ఇప్పటికీ నా చేతిలో అరడజను సినిమాలు ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘టక్కర్‌’ న్యూ జనరేషన్‌ సినిమా. ఇందులో సిద్ధార్థ్‌ని రగ్డ్‌ లవర్‌ బోయ్‌గా చూస్తారు ’’ అన్నారు కార్తీక్‌ జి. క్రిష్‌. ‘‘ఈ సినిమాతో మళ్లీ పాత సిద్ధార్థ్‌ని చూస్తాం’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల.  

మరిన్ని వార్తలు