Siddharth: సురేశ్‌కు వార్నింగ్‌ ఇవ్వమని నాకు సలహా ఇచ్చారు: సిద్ధార్థ్

3 Oct, 2023 19:04 IST|Sakshi

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్. ఈ చిత్రంలో జెనీలియా అతనికి జంటగా నటించింది. ప్రస్తుతం ఆయన చిత్తా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కాగా.. తెలుగు ఈనెల 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌కు ఆయన హాజరయ్యారు. 

(ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే? )

అయితే ఈ ప్రెస్‌ మీట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సినిమా ఈవెంట్స్‌లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్‌గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి కూడా హాజరయ్యారు. ఆయన ప్రశ్నలు అడిగేముందే హీరో సిద్ధార్థ్.. అతనిపై సీరియస్‌ కామెంట్స్ చేశారు. మీరు కాస్తా పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్‌లో సలహా ఇచ్చారంటూ సిద్ధార్థ్ అన్నారు. 

సిద్ధార్థ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. 'కొండేటి సురేశ్‌కు ఒక వార్నింగ్. మొత్త ఇంటర్నెట్‌ నీకు వార్నింగ్ ఇవ్వమంది. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు. అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను. సురేశ్ కొండేటి నా ఫ్రెండ్‌ అయ్యా. అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పా' అని నవ్వుతూ అన్నారు.  ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్‌ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!)

మరిన్ని వార్తలు