వైరల్‌ అవుతున్న కియారా, సిద్దార్థ్‌ల రొమాంటిక్‌ వీడియో!

12 Aug, 2021 13:30 IST|Sakshi

బాలీవుడ్‌ రూమర్డ్‌ కపుల్‌ కియారా అద్వానీ, సిద్దార్థ్‌ మల్హోత్రాలకు సంబంధించిన రొమాంటిక్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కాగా గత కొంతకాలంగా వీళ్లీద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు బీ-టౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ హాలీడే వేకషన్‌కు మాల్దివులు వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి.

ఇదిలా ఉండగా సిద్దార్థ్‌ మల్హోత్రా ఇటీవల ఓ వీడియో షేర్‌ చేశాడు. బ్యాగ్రౌండ్‌లో వారిద్దరూ నటించిన తాజా చిత్రం ‘షెర్షా’ సాంగ్‌ ప్లే అవుతుండగా.. కియారా అలా ముందుకు నడుస్తూ ఉంటే వెనకాల సిద్దార్థ్‌ వచ్చి తన చేయి పట్టుకుని రొమాంటిక్‌గా వెనక్కి లాగుతూ కనిపించాడు. ఈ సన్నివేశంలో వారిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. చూడటానికి అచ్చం ‘రియల్‌ కపుల్‌లా ఉన్నారు’, ‘క్యూట్‌ జోడి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా సిద్దార్థ్‌, కియారాలు తొలిసారి జంటగా నటించిన ‘షెర్షా’ మూవీ అగష్టు 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ పరమ వీర చక్ర అవార్డు గ్రహీత, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందింది. ఇక షేర్షా మూవీ ప్రమోషన్‌లో భాగంగా సిద్దార్థ్‌ ఈ వీడియో షేర్‌ చేశాడు. కాగా ఇటీవల కియారా ఓ ఇంటర్య్వూలో సిద్దార్థ్‌ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితుడని, తామిద్దరం మంచి స్నేహితులమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు