Siddharth Shukla :సిద్ధార్ధ్‌, హెహ్నజ్‌ల లవ్‌ స్టోరి ఇదే..

2 Sep, 2021 12:58 IST|Sakshi

Sidharth Shukla: నటుడు సిద్ధార్ద్ శుక్లా(40) మరణంతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌13 విజేతగా నిలిచిన సిద్ధార్ద్ శుక్లా గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచాడు. సిద్ధార్ద్ శుక్లా మరణ వార్త విని సినీ ప్రముఖులు సహా అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. 1980 డిసెంబర్‌12న ముంబైలో జన్మించిన శుక్లా 'హంప్టీ శర్మ కి దుల్హనియా' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు.


చదవండి: బిగ్‌బాస్‌-13 విన్నర్‌, చిన్నారి పెళ్లి కూతురు ఫేం సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం

ఈ చిత్రంలో సహాయక పాత్రలో నటించిన సిద్ధార్థ్‌ బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో టెలివిజన్‌ స్టార్‌గా ఎదిగాడు. టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పింపిన  సిద్ధార్ద్ శుక్లా బిగ్‌బాస్‌ సీజన్‌ 13లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఈ షోలో సిద్ధార్ద్ -షెహనాజ్‌ గిల్‌ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

సిద్దార్థ్ శుక్లా- షెహనాజ్‌తొలిసారిగా బిగ్‌బాస్‌ హోస్‌లోనే కలుసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. హోస్‌లో ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్‌ చేసుకునేవారు. ఇక షెహనాజ్‌ సిద్ధార్థ్‌ విషయంలో ఎంతో పొసేసివ్‌గా ఉండేది. సిద్ధార్థ్‌ ఏ అమ్మాయితో అయినా కాస్త ప్రేమగా మాట్లాడినా సహించేది కాదు.  సిద్ధార్థ్‌ శుక్లా నా వాడు అంటూ స్వయంగా ఆమె రియాలిటీ షోలోనే పేర్కొంది.

ఈ సీజన్‌ పూర్తయి రెండేళ్లు కావస్తున్నా ఈ కపుల్స్‌కి ఏ మాత్రం ఆధరణ తగ్గలేదు. 'సిద్నాజ్‌' పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో వీరికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. ఇప్పటికీ  వీరి లవ్‌ట్రాక్‌కి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ పూర్తయిన తర్వాత కూడా వీరి బంధం కొనసాగింది. షెహనాజ్‌ సిద్దార్థ్ శుక్లా జంటగా మ్యూజిక్‌ ఆల్భమ్స్‌లలోనూ పాల్గొన్నారు. కొద్ది రోజుల కిందటే సిద్ధార్ద్ -షెహనాజ్‌ జంటగా బిగ్‌బాస్‌ ఓటీటీకి విచ్చేసి సందడి చేసిన ఈ జోడీ చివరగా డ్యాన్స్‌ దివానే-3 షోలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి : సిద్ధార్థ్‌ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్‌

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

మరిన్ని వార్తలు