Siddhu Jonnalagadda: ఆ సినిమాను పక్కన పెట్టిన డీజే టిల్లు !.. కారణం అదేనా ?

24 Apr, 2022 21:03 IST|Sakshi

Siddhu Jonnalagadda Is Put Aside Malayalam Kappela Remake Movie: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్‌ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్‌ బిఫోర్ వెడ్డింగ్‌, గుంటూరు టాకీస్‌, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్‌ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. దీంతో సిద్ధు తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇదివరకు ఒప్పుకున్న ఓ సినిమాను ఇప్పుడు చేయనని అంటున్నాడట ఈ హీరో. 

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం 'కప్పెలా' రీమెక్‌లో సిద్ధు ఓ కీలక పాత్రలో చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 'డీజే టిల్లు' మూవీ నిర్మించిన అదే బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. శౌరి చంద్రశేఖర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ను కాపాడే మరో హీరో పాత్రలో సిద్ధును సెలెక్ట్‌ చేశారట. ఈ రోల్‌ కొద్దిసేపే ఉన్న చాలా సినిమాలో చాలా ప్రభావం చూపిస్తుందట. అయితే ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో మళ్లీ ఇలాంటి పాత్రలు చేస్తే తన పాపులారిటీ తగ్గుతుందేమోనని సిద్ధు భయపడుతున్నాడని టాక్. అందుకే ఈ రీమేక్‌ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ మొదలు పెట్టామని, అగ్రిమెంట్‌పై కూడా సంతకం చేసి ఎలా తప్పుకుంటాడని డైరెక్టర్‌ నిలదీయడంతో అతడిపై సిద్ధు కొంచెం దురుసుగా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో ఇంకా తెలియరాలేదు. 

చదవండి: 12 ఏళ్ల తర్వాత ఫేం వచ్చింది: డీజే టిల్లు హీరో సిద్దు

కప్పెలా తెలుగు రీమేక్‌ చిత్రం పూజా కార్యక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ

చదవండి: డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్‌ డ్యాన్స్‌ చూశారా

మరిన్ని వార్తలు