వైరల్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోయాడు

20 Oct, 2020 10:10 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేత సిధార్థ్‌ శుక్లాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని అతడిని మరో సారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. అతడితో పాటు గతంలో బిగ్‌బాస్‌ విజేతలుగా నిలిచిన హీనా ఖాన్‌, గౌహర్‌ ఖాన్‌లను కూడా‌, సిధార్థ్‌ శుక్లాతో పాటు రెండు వారాల కోసం బిగ్‌బాస్‌ 14 హౌజ్‌లోకి పంపించారు. అయితే తాజాగా సిధార్థ్‌ శుక్లా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వస్తున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. బిగ్‌బాస్‌ 14 ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశారు. సిధార్థ్ బిగ్‌బాస్‌ ఇంటి నుంచి వైదొలిగాడు, కానీ బిగ్ బాస్ 14 సెట్ ఉన్న ఫిల్మ్ సిటీలో ఉన్నాడు. దీని వెనుక కారణం ఇంకా తెలియదు. బిగ్ బాస్ 14 ఇంట్లో సిధార్థ్ మరికొన్ని రోజులు కొనసాగుతాడనే వార్తల నేపథ్యంలో ఈ ఫోటోలు షేర్‌ చేయడం గమనార్హం. (చదవండి: బిగ్‌బాస్‌ జంట ఫోటోలు మళ్లీ వైరల్‌!)

ఈ క్రమంలో కోయిమోయిలోని ఒక నివేదిక సిధార్థ్‌ మరికొంత కాలం హౌస్‌లో కొనసాగుతాడని వెల్లడిస్తుంది. " బిగ్‌బాస్‌ నిర్వహకులు సిధార్థ్ శుక్లా నుంచి ఏమి ఆశించారో అతడు దానిని పూర్తిగా అందిస్తున్నాడు. అతని అభిమానుల నుంచే కాక, ఇంట్లో అతని సమీకరణాలతో బిగ్ బాస్ 14 మేకర్స్ వెతుకుతున్న క్రేజ్‌ని అందిస్తున్నాడు. ప్రారంభంలో, అతను హీనా, గౌహార్ మాదిరిగానే ఉండాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సిధార్థ్‌ని మరి కొంత కాలం హౌజ్‌లో ఉంచి టీఆర్‌పీ పెంచాలని చూస్తున్నారు’ అని తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు