SIIMA 2023:నేడు సైమా అవార్డ్స్‌ ప్రకటన.. పోటీ పడుతున్న తెలుగు స్టార్స్‌.. కానీ అదొక్కటి తక్కువైంది

15 Sep, 2023 11:38 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుగా సైమాకు గుర్తింపు ఉంది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుక మరికొన్న గంటల్లో దుబాయ్‌లో జరగనుంది. ఇప్పటికే అక్కడకు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా చేరుకున్నారు. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది పరిపాటి అని తెలిసిందే. ఈ పోటీలో ఎవరెవరున్నారో ఆ లిస్ట్‌ను సైమా ఇప్పటికే విడుదల చేసింది.

ఉత్తమ నటుడు, చిత్రం – తెలుగు (2023)

అడవి శేష్   (మేజర్)
♦ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR)
♦ దుల్కర్ సల్మాన్ (సీతారామం)
♦ నిఖిల్ సిద్దార్ద్ (కార్తికేయ)
♦ సిద్దు జొన్నలగడ్డ (DJ టిల్లు)

ఉత్తమ దర్శకుడు – తెలుగు (2023)
♦ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
♦ హను రాఘవపూడి (సీతారామం)
♦ చందూ మొండేటి (కార్తికేయ 2)
♦ శశికిరణ్‌ తిక్కా (మేజర్‌)
♦ విమల్‌ కృష్ణ (డీజే టిల్లు) 

ఉత్తమ గేయ రచయిత
♦ RRR సినిమా నుంచి నాటు నాటు (చంద్రబోస్)
♦ సీతారామం నుంచి 'ఇంతందం' సాంగ్‌ (కృష్ణకాంత్)
♦ ఆచార్య సినిమా నుంచి 'లాహె.. లాహె' సాంగ్ (రామజోగయ్య) 
♦ RRR నుంచి 'కొమురం భీముడో' సాంగ్ (సుద్దాల అశోక్ తేజ)

ఉత్తమ సహాయ నటి
♦ అక్కినేని అమల (ఒకే ఒక జీవితం)
♦ ప్రియమణి (విరాట పర్వం)
♦ సంయుక్త మీనన్ (భీమ్లా నాయక్)
♦ సంగీత (మాసూద)
♦ శోభిత ధూళిపాళ (మేజర్)

ఉత్తమ విలన్ 
♦ సత్యదేవ్‌ (గాడ్‌ ఫాదర్)
♦ జయరామ్ (ధమాకా)
♦ సముద్రఖని (సర్కారు వారి పాట)
♦ సుహాస్  (హిట్-2)

పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు గెలుచున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సైమా 2023లో కనీసం నామినేషన్ కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్‌ అసంతృప్తితో ఉన్నారు. 

(ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్‌లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?)

మరిన్ని వార్తలు