గౌతమ్‌ మీనన్‌తో ముచ్చటగా‌ మూడోసారి

30 Jan, 2021 01:35 IST|Sakshi

తమిళ హీరో శింబు, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ మూడోసారి ఒక ప్రాజెక్ట్‌కి కలవనున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమయడా’ (ఈ రెండు సినిమాలను ‘ఏ మాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’గా నాగచైతన్యతో తెలుగులో తెరకెక్కించారు గౌతమ్‌ మీనన్‌) చిత్రాలు వచ్చాయి. లాక్‌డౌన్‌లో ‘కార్తీక్‌ డయల్‌ సెయ్‌ ద ఎన్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ కూడా చేశారు శింబు, గౌతమ్‌ మీనన్‌. ఐ ఫోన్‌తో ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ లఘు చిత్రం చేశారు. తాజాగా ఓ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. వేల్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాణంలో ఇషారీ కే గణేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘కొన్ని కథలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్‌ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది’’ అన్నారు గౌతమ్‌ మీనన్‌. ఇది ‘విన్నైత్తాండి వరువాయా’కు సీక్వెల్‌ అని ప్రచారంలో ఉంది.

మరిన్ని వార్తలు