ఐదు భాషల్లో శింబు ‘రివైండ్‌’

4 Feb, 2021 05:26 IST|Sakshi
కల్యాణీ ప్రియదర్శన్, శింబు

‘‘శింబు హీరోగా నటిస్తున్న సినిమా టీజర్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి హిట్‌ అవ్వాలి. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అన్నారు హీరో రవితేజ. శింబు, కల్యాణీ ప్రియదర్శన్‌ జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రివైండ్‌’. హిందీ–తమిళ్‌– తెలుగు–కన్నడ–మలయాళ భాషల్లో సురేష్‌ కామాచి నిర్మిస్తున్నారు. తమిళంలో ‘మానాడు’, తెలుగులో ‘రివైండ్‌’ టైటిల్‌తో రూపొందుతోంది. బుధవారం శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్‌ని రవితేజ రిలీజ్‌ చేశారు.

‘మానాడు’ హిందీ టీజర్‌ని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్, తమిళ టీజర్‌ని సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్, కన్నడ టీజర్‌ని హీరో సుదీప్‌ విడుదల చేశారు. ‘‘పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శింబు ముస్లిమ్‌ పాత్ర చేస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దర్శకులు భారతీరాజా, ఎస్‌.ఎ. చంద్రశేఖర్, ఎస్‌.జె. సూర్య, కరుణాకరన్‌ నటిస్తుండడం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతదర్శకుడు.

మరిన్ని వార్తలు