శింబు: వాట్‌ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్‌..ఫోటో వైరల్‌

13 Aug, 2021 20:50 IST|Sakshi

కోలీవుడ్‌ హీరో శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'వెందు తానింధుడు కాదు'. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గిన శింబు సరికొత్త లుక్‌లో అలరిస్తున్నారు. లేటెస్ట్‌గా తన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోను శింబు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో క్లీన్‌షేవ్‌తో స్టైలిష్‌ లుక్‌లో శింబు కనిపిస్తున్నారు.

కాగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో శింబు ఇది వరకే ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ రీమేక్‌ వెర్షన్‌లలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. సీనియర్‌ నటి రాధిక శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. 

మరిన్ని వార్తలు