Atharva Movie: ‘అధర్వ’ మూవీ నుంచి హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

26 Sep, 2022 13:26 IST|Sakshi

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అధర్వ'. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా,సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు.అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదరి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఇందులో నిత్య అనే పాత్రలో సిమ్రాన్ చౌదరి కనిపించనుందని మేకర్స్‌ తెలిపారు.  డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాను సంగీతం అందిస్తున్నారు. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

మరిన్ని వార్తలు