ఫోన్‌ విసిరేసిన బాలయ్య.. స్పందించిన హీరోయిన్‌

19 Nov, 2020 16:21 IST|Sakshi

‘సెహరి’ మిమ్స్‌పై స్పందించిన హీరోయిన్‌

మిమర్స్‌ మిత్రులకు ధన్యవాదాలు

సాక్షి, హైదరాబాద్‌: నటీనటులపై ట్రోల్స్‌, మిమ్స్‌ సర్వసాధారణం. అయితే ట్రోల్స్‌పై కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే మరికొందరూ నటీనటులు వాటికి స్పందించకుండా లైట్‌లే అనుకుని వదిలేస్తుంటారు. అలాగే ‘సెహరి’ కథానాయిక సిమ్రన్‌ చౌదరి కూడా మూవీ ఫస్ట్‌లుక్‌ కార్యక్రమంలో బాలయ్యపై వస్తున్న మిమ్స్‌పై స్పందిస్తూ మిమర్స్‌ను ఏకిపారేశారు. హర్ష్‌ కనుమిల్లి, సిమ్రన్‌ చౌదరిలు జంటగా గంగాసాగర్‌ ద్వారక దర్శకత్వంలో ‘సెహరి’ తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పోస్టర్‌ విడుదల సందర్భంగా బాలయ్య.. హీరో హర్ష్‌ కనుమిల్లి చేతిని కొట్టినట్లుగా కనిపించాడు. అలాగే కోపంతో ఫోన్‌ విసిరికొట్టి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో ట్రోలర్స్‌ సోషల్‌ మీడియాలో తమకు నచ్చినట్టుగా మిమ్స్‌ రాసి సోషల్‌ మీడియాలో వినోదాన్ని పంచుతున్నారు. (చదవండి: ఫోన్‌ విసిరేసిన బాలకృష్ణ : వైరల్‌ వీడియో)

ఈ కార్యక్రమంలో హీరో హర్ష్‌, బాలకృష్ణ, హీరోయిన్ సిమ్రాన్‌లను ఉద్దేశిస్తూ ఫన్నీ మిమ్స్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబం‍ధించిన ఫన్నీ మిమ్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదరి మిమ్స్‌పై స్పందించారు. ‘అందరికి హాయ్‌.. ఈ స్టోరీ ప్రత్యేకంగా మిమర్స్‌ మిత్రుల కోసమే పెడుతున్నాను. నిన్న జరిగిన మా ‘సెహరి’ పోస్టర్‌ విడుదల కార్యక్రమాన్ని అంత బాగా పాపులర్‌ చేసిన ప్రతి ఒక్క మిమర్స్‌ మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు క్రియేట్‌ చేసి నన్ను ట్యాగ్‌ చేసిన ప్రతి మీమ్‌ నేను చుశాను. ఇవి నిజంగానే కామెడిగా అనపించాయి. కరోనా వంటి కష్టకాలంలో మీ మిమ్స్‌తో ప్రజలకు వినోదాన్ని ఇస్తున్న మీ క్రియేటివిటికి ధన్యవాదాలు’ అంటూ ఆమె తనదైన శైలిలో మిమర్స్‌కు చురక అంటించారు. (చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా