సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మీనాక్షి చౌదరి' హిట్‌ సినిమా

23 Feb, 2024 08:18 IST|Sakshi

కోలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన సింగ‌పూర్ సెలూన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో  మీనాక్షి చౌదరి-  ఆర్‌జే బాలాజీ జోడీగా నటించారు. స‌త్య‌రాజ్‌, లాల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న త‌మిళ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం విడుదల అయింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.15 కోట్ల వరకు కలెక్షన్స్‌ రాబట్టింది.

ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. సినిమాకు మంచి టాక్‌ రావడంతో మొదట తెలుగులో కూడా డబ్‌ చేసి విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. కానీ హాఠాత్తుగా తమిళ వర్షన్‌ మాత్రమే ఓటీటీలోకి వచ్చేసింది. త్వరలో తెలుగులో కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం.

సింగ‌పూర్ సెలూన్ సినిమాలో డైరెక్టర్‌ లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో పాటు అర‌వింద్ స్వామి,జీవా అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందాలని, తన వ్యాపారాన్ని విస్తరించాలనే డ్రీమ్స్‌ ఉన్న యువకుడి పాత్రలో ఆర్‌జే బాలాజీ కనిపిస్తే.. ఇంజినీరింగ్  చదివిన అతడు ఎందుకు సెలూన్‌ వృత్తిని కొనసాగిస్తాడు..? పేద కుటుంబానికి చెందిన అతన్ని గొప్పింటి వర్గానికి చెందిన అమ్మాయి (మీనాక్షి చౌద‌రి) ఎలా ప్రేమలో పడింది..? ఈ క్రమంలో హీరోకు ఎదురయ్యే కష్టాలు, ఎమోషన్స్‌, కామెడీ వంటి అంశాలతో డైరెక్టర్‌ గోకుల్‌ మెప్పించాడని చెప్పవచ్చు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు