Chinmayi: అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్‌ ఘాటు వ్యాఖ్యలు

6 Dec, 2021 11:41 IST|Sakshi

Singer Chinmayi Sensational Comments About Marriages: ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద పరిచయం అక్కర‍్లేని పేరు. క్యాస్టింగ్‌ కౌచ్ గురించి బహిరంగంగా పోరాడింది చిన్మయి. సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స‍్పందిస్తుంటుంది. అమ్మాయిలకు పెళ్లిళ్ల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తుంటుంది. అయితే ఇలా చేయడంతో అప్పుడప్పుడు నెటిజన్స్‌ ఇష్టానుసారంగా చిన్మయిని ట్రోలింగ్‌ చేస్తుంటారు. ఆ ట్రోలింగ్‌ కుడా చిన్మయి ధీటుగా సమాధానం ఇస్తుంది. తాజాగా మరోసారి తన ఇన్‌స్టా గ్రామ్‌ అకౌంట్‌లో అమ్మాయిల పెళ్లి గురించి స్పందించింది. 

'డ్రంకెన్ డ్రైవింగ్‌, ఓవర్ స్పీడ్‌ గురించి ఒక అవగాహన కార్యక్రమం ఉందనుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి చేయాలి. అవి చేయొద్దు. అని చెబుతారు. అంటే ప్రతీ ఒక్కరూ తాగి బండి నడుపుతున్నారని కాదు. అది ఎవరికి అవసరమో వారికే చెబుతున్నట్లు లెక్క. నేను పెడుతున్న స్టోరీస్‌ చూసి ఎన్ఆర్‌ఐస్‌ అందరూ అలా కాదు, జనరలైజ్‌ చేయకే.. అని వాగనక్కర్లేదు. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ చెబుతున్నాను. దీంతో మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని. నాకేమో ఈ ఫారెన్‌ సంబంధం ఎప్పటికీ అర్థం కాదు. తమ కూతురుకు గౌరవంగా జీవించే అవకాశం అస‍్సలు ఇవ్వరు. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కట్నం ఇచ్చి మరీ పెళ్లీ చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్రంగా బతకనివ్వరు.' అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది చిన్మయి. 

ఇంకా.. 'ఆర్థికంగా, స్వతంత్రంగా అమ్మాయిలు ఉంటే అవగాహనతో వేరే కాస్ట్‌ వారిని పెళ్లి చేసుకుంటారని భయం. ఫోర్స్‌ చేసి వెధవైనా పర్లేదు సొంత కాస్ట్‌లోనే వారినే పెళ్లి చేసుకోవాలి. తర్వాత కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. ఈ  స్టోరీస్‌ చూసి కొంతమంది అమ‍్మాయిలైన సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది నాకు చాలు. అవగాహన కల్పిస్తుంటే హిస్టారికల్‌గా చూస్తే కూడా మనుషులకు కోపం వస్తుంది. బాలికల నుంచి సదీ సహగమనం లాంటి చెత్త సాంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతిసారీ ఇలాంటి కోపాన్నే ప్రదర‍్శించారు. అందరు అబ‍్బాయిలు తమ సోదరీమణులకు ఇలానే చేస్తారా ? చేయనంటే వారంతా నాతో అంగీకరించినట్టే. మిగిలిన వాళ్లకు కోపం వస్తే కోప్పడండి. మీ ఈగోలను సాటిస‍్ఫై చేసి మిమ్మల్ని శాంతింపచేసేందుకు నేను రాలేదు.' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇదీ చదవండి: ‘బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా’

మరిన్ని వార్తలు