పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి

22 Jun, 2022 09:22 IST|Sakshi

ప్రమఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్ద‌రి పిల్ల‌ల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్‌ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. ఇద్దరిలో ఒక‌రికి ద్రిప్త అని.. మ‌రొక‌రికి శర్వాస్ అని పేరు పెట్టిన‌ట్లు తెలియజేశారు. చిన్మయి, రాహుల్‌ తల్లిదండ్రులు కావడంపై నెటిజన్స్‌, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

కాగా, రాహుల్‌, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన  చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు.  మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. 

ఇక రాహుల్‌ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో రాహుల్‌ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకత్వం దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు.

మరిన్ని వార్తలు