ప్రముఖ గాయనీ గీతా దత్‌ జయంతి.. ఆమె ఆలపించిన 5 బెస్ట్‌ సాంగ్స్‌

22 Nov, 2021 15:45 IST|Sakshi

Singer Geeta Dutt Birth Anniversary And Her Top 5 Best Songs: వినసొంపైన సంగీతమంటే ఇష్టపడనివారుండరూ. చక్కని సంగీతం వింటే ఎంత బాధ ఉన్న అప్పటివరకైతే ఒకరకమైన స్వాంతన కలుగుతుంది. నిజంగానే మ్యూజిక్‌లో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్‌ను క్రియేట్‌ చేసే సింగర్స్‌ ఇండస్ట్రీలో ఎంతోమంది. అయినా ఎవరి ప‍్రత్యేకత వారిదే. అలాంటి గొప్ప గాయనీల్లో ఒకరు గీతా దత్‌. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఆమె గానం చేసిన 'బాబూజీ ధీరే చల్నా', 'వక్త్‌ నే కియా' వంటి మెలోడీలను విననివారుండరు. గీతా దత్ పాడిన పాటలు ఎంత పాతవైన వాటిలోని మాధుర్యం ఇప‍్పటికీ అలాగే ఉంటుంది. 

గీతా దత్‌ నవంబర్‌ 23, 1930న మదరిపూర్‌ జిల్లా బంగ్లాదేశ్‌లో జన్మించారు. ఆమెకు ముగ్గురు సంతానం. ఈ గాయనీ తన పలు బలీయమైన సవాళ్లను ఎదుర్కొన‍్నారు. అ‍ల్లకల్లోలమైన వైవాహిక జీవితాన్ని గడిపారు. తన బాధలను మర్చిపోయేందుకు మద్యానికి బానిసయ్యారు. అనంతరం 42 ఏళ్ల (జూలై 20, 1972)  వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. గీతా దత్‌ జయంతి సందర్భంగా ఆమె ఆలపించిన మధురగానాలు ఓసారి విందామా.

1. బాబూజీ ధీరే చల్నా (ఆర్‌ పార్‌, 1954)

2. జానే కహా మేరా జిగర్‌ గయా (మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ 55, 1955)

3. ఏ దిల్‌ హై ముష్కిల్‌ జీనా జరా హట్కే జరా బచ్కే (సీఐడీ, 1956)

4. మేరా నామ్‌ చిన్‌ చిన్‌ చూ (హౌరా బ్రిడ్జ్‌, 1958)

5. కోయీ చుప్కే సే ఆకే (అనుభవ్‌, 1971)

మరిన్ని వార్తలు