UAE Golden Visa: ప్రముఖ గాయనికి అరుదైన గౌరవం

20 Oct, 2021 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నేపథ్య గాయని కేఎస్‌ చిత్ర అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యుఏఈ గోల్డెన్ వీసా దక్కించుకున్నారు.యూఏఈ గోల్డెన్‌ వీసా అందుకున్నట్టు స్వయంగా చిత్ర సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బుధవారం ఉదయం దుబాయ్ ఇమ్మిగ్రేషన్ చీఫ్ హెచ్‌ఇ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మారి చేతుల మీదుగా యుఎఇ గోల్డెన్ వీసా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేశారు. 

చదవండి: kidney transplantation: సంచలనం

ఇటీవల మాలీవుడ్‌కు చెందిన పలువురు నటులకు ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసాను ప్రకటించింది. వీరిలో మలయాళ సూపర్‌ స్టార్స్‌ మమ్ముట్టి, మోహన్ లాల్‌, పృథ్వీరాజ్,  దుల్కర్ సల్మాన్‌ను గోల్డెన్‌ వీసాతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఇంకా టొవినో థామస్, నైలా ఉష, దర్శకుడు , సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఆశా శరత్, ఆసిఫ్ అలీ లాంటి మాలీవుడ్‌ ప్రముఖులు కూడా  ఉండటం విశేషం. బాలీవుడ్‌ నుంచి షారూఖ్ ఖాన్, సంజయ్ దత్‌ ఈ వీసాను స్వీకరించారు.

కాగా 2019లో యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. పెట్టుబడిదారులు, వైద్యులు, ఇంజనీర్లు, ఆయా రంగాల్లో గణనీయ కృషి చేసిన కళాకారులు,ఇతర ప్రముఖులకు ఈ గౌరవాన్నిస్తుంది. గోల్డెన్ వీసా గ్రహీతలు 10 సంవత్సరాల పాటు జాతీయ స్పాన్సర్ అవసరం లేకండా అక్కడి వర్క్‌ చేసుకోవచ్చు. అంతేకాదు గడువు ముగిసిన వెంటనే ఆటోమేటిగ్గా  రెన్యువల్‌ కావడం ఈ వీసా ప్రత్యేకత.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు