సొంతింటి కల సాకారం చేసుకున్న సింగర్‌, గ్రాండ్‌గా గృహప్రవేశం

17 Feb, 2023 15:35 IST|Sakshi

కుమారి 21 ఎఫ్‌ చిత్రంతో తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరైన సింగర్‌ లిప్సిక. గాయనిగానే కాదు డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ రాణిస్తోంది. తాజాగా లిప్సిక సొంతింటి కలను సాకారం చేసుకుంది. నూతన గృహంలో పాలు పొంగించింది. గృహప్రవేశాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడంతో పాటు ఈ వేడుకకు బంధుమిత్రులను ఆహ్వానించింది. తన గృహప్రవేశం ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. భర్తతో కలిసి ఇంట్లో కుడికాలు పెట్టిన ఫోటోలను, పూజ చేసిన పిక్స్‌ను సైతం షేర్‌ చేసింది.  ఇవి చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఇక లిప్సిక పాటల విషయానికి వస్తే ఎంబీఏ పూర్తి చేసిన ఆమె గాయనిగా సినీ కెరీర్‌ ప్రారంభించింది. మేం వయసుకు వచ్చాం సినిమాతో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ మారింది. హెబ్బా పటేల్‌, మెహరీన్‌, మేఘా ఆకాశ్‌ వంటి హీరోయిన్స్‌కు డబ్బింగ్‌ చెప్తూ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతోంది.

A post shared by Sah Events (@sahevents)

చదవండి: అఫీషియల్‌.. అప్పటినుంచే ఓటీటీలో అందుబాటులోకి వారసుడు

మరిన్ని వార్తలు