ఈ జీవితానికి ఇంకేం కావాలి: మంగ్లీ భావోద్వేగం

20 Apr, 2021 13:31 IST|Sakshi

సింగర్‌ మంగ్లీ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. టీవీ ఛానెల్‌లో న్యూస్‌ యాంకర్‌గా మొదలైన మంగ్లీ ప్రయాణం సినిమాల్లో పాటలు పాడే స్థాయికి వెళ్లింది. తనదైన మాటలు, జానవపద పాటలతో క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందరినీ తన అభిమానులుగా మార్చుకుంది.

అల్లు అర్జున్‌ సినిమాలో 'రాములో రాములా..' అంటూ అందరితో స్టెప్పులేయించిన ఈ సింగర్‌ లేటెస్ట్‌గా 'సారంగదరియా..' పాటతో మరోసారి ప్రేక్షకజనాన్ని ఉర్రూతలూగించింది. ఆకాశవాణిలో 'మనకోన..' అంటూ మట్టివాసన గొప్పదనాన్ని పాట ద్వారా జనాలకు అందించింది. తెలుగులోనే కాకుండా కన్నడ 'రాబర్ట్‌' చిత్రంతో అక్కడి ప్రేక్షకులకు కూడా చేరువయ్యింది. ఆమె సాంగ్‌ ఎంత హిట్టయ్యిందో, ఆమె పాపులారిటీ కూడా అంతకు రెట్టింపైంది.

ఈ నేపథ్యంలో కొన్ని కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు అతికించి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ఫొటోలు మంగ్లీ కంట పడ్డాయి. ఇంకేముందీ.. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉద్వేగానికి లోనైంది. కన్నడిగులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైంది.  ఈ జీవితానికి ఇంకేం కావాలి? సదా మీ ప్రేమను కోరుకునే.. మీ మంగ్లీ.." అంటూ చేతులు జోడించి క్యాప్షన్‌ ఇచ్చింది.

కర్ణాటకలోని మస్కి ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసింది మంగ్లీ. మస్కి నియోజకవర్గంలోని అడవిబావి, హడగలి తాండాల్లో ఇంటింటా కలియతిరుగుతూ తాండా భాషలో మాట్లాడింది. మంగ్లీకి ఇటీవల కర్ణాటకలో కూడా విశేష ఆదరణ లభించడంతో ఆమెను ప్రచారంలోకి దింపారు. ఈ క్రమంలో అక్కడి ప్రవాసాంధ్ర క్యాంపులతో పాటు మస్కి పట్టణంలో కూడా ఆమె ప్రచారంలో పాల్గొంది. 

A post shared by Mangli Singer (@iammangli)

చదవండి: సుకుమార్‌-రౌడీ సినిమాపై రూమర్లు.. వాస్తవమేంటంటే!

ఆ దర్శకుడు ఏదో ఆశించాడు, ఇప్పటికీ ఫోన్‌ చేస్తాడు: హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు