ఫుడ్‌ డెలివరీ బాయ్‌ టాలెంట్‌కు మెచ్చి సాయం చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

7 Jan, 2024 18:04 IST|Sakshi

మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్‌ షో. ఇలాంటి సింగింగ్‌ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్"  స్టార్ మాలో   మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్‌ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. 

తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్‌ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్‌ సిప్లిగంజ్‌ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే మ్యూజిక్‌ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్‌ సిప్లిగంజ్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు.

గతంలో తాను కూడా ఒక బార్బర్‌ షాప్‌లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్‌ చెప్పాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్‌కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్‌.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్‌ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

A post shared by STAR MAA (@starmaa)

>
మరిన్ని వార్తలు