జూబ్లీహిల్స్‌ పబ్‌లో సిద్‌ శ్రీరాంకు అవమానం!

10 Mar, 2021 09:45 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరాం పాడిన పాటలన్ని సూపర్‌ హిట్‌. తన వైవిధ్యమైన గాత్రంతో తెలుగులో చాలా క్రేజ్‌ సంపాధించుకున్నారు. ఆయన పాడిన ప్రేమ పాటలు తెలుగుతో చాలా ఫేమస్‌ అందుకే తెలుగు దర్శక నిర్మాతలు పట్టుబట్టిమరి ఆయనతో ఒక్కపాటైనా పాడిస్తున్నారు. ఆయన పాటతో సినిమా మరో లేవల్‌కు చేరుతుందని టాలీవుడ్‌లో ఓ నమ్మకం కొనసాగుతోంది. దీంతో సిద్‌ శ్రీరాం తెలుగులో వరుస అవకాశాలతో ‍ దూసుకువెళుతున్నారు. తాజాగా సింగర్‌ సిద్‌ శ్రీరాంకు తీవ్రమైన అవమానం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ఆయన పాల్గొనగా.. కొందరు ఆకతాయిలు వాటర్‌ బాటిళ్లు, మద్యం విసిరేసి శ్రీరాంను అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన శ్రీరాం ఆకతాయిలను బయటకు వెళ్లండంటూ వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ గొడవ జరిగినప్పుడు పబ్‌లో మరికొందరు సెలబ్రిటీలు, ప్రముఖులు ఉండటంతో విషయం పెద్దది కాకుండా పబ్‌ యాజమాన్యం జాగ్రత్త పడిందట. ఇదిలాఉండగా.. ‘క్రమ శిక్షణ ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే క్రమశిక్షణ ముఖ్యం’ అని మార్చి 5న శ్రీరాం ట్వీట్‌ చేశాడు. పబ్‌లో తనపట్ల అనుచితంగా వ్యవహరించిన ఆకతాయిలను ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ‘రంగ్‌దే’ మూవీలో ఆయన పాడిన పాట ‘నా కనులు ఎపుడు’  వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

చదవండి: వుమెన్స్‌ డే: అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం 
చదవండి: ‘నా కనులు ఎపుడు’ లిరికల్‌ వీడియో‌ వచ్చేసిందిగా...

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు