కరోనా బాధితులకు సింగర్‌ స్మిత ఆక్సిజన్‌ సాయం

23 May, 2021 17:26 IST|Sakshi

దేశ వ్యాప్తంగా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్‌ కోరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే నటుడు సోను సూద్‌ ఫౌండేషన్స్‌ ఏర్పాటు చేసిన దానికి ద్వారా బాధితులకు మందులు, ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌ పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి సైతం ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. 

తాజాగా పాప్‌ సింగర్‌ స్మిత సైతం కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. గతంలో తను స్టాపించిన ఏఎల్‌ఏఓతో (ALAO)  పాటు పలు స్వచ్చంద సంస్థల ద్వారా ఆమె వివిధ ప్రాంతాల్లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు 100 ఆక్సిజన్‌ పడకలను అందించారు. స్వయంగా ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ స్మిత ట్వీట్‌ చేశారు.

అలాగే దర్శకుడు సూకుమార్‌ సైతం కోవిడ్‌ బాధితుల కోసం శాశ్వత ప్రతిపాదికన ఆక్సిజన్‌ ప్లాంట్‌  ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన స్వస్థలమైన కాకినాడ దగ్గర రాజోలు గ్రామంలో40 లక్షల రూపాయలతో డీఓసీఎస్‌ 80 ఆక్సిజన్‌ జనరేటర్‌ సిస్టమ్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించేందుకు ఆయన ఇప్పటికే ముందుకు వచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు