Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌పై సింగర్‌ స్మిత సంచలన వ్యాఖ్యలు.. ‘చచ్చినా ఆ తప్పు చేయను’

5 Sep, 2022 19:49 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో అంటే పడిచచ్చేవారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు కూడా అంతే ఉన్నారు. ఇప్పటికే ఈ రియాలిటీ షోపై సీపీఐ నేత అల్లం నారాయణ ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.  బిగ్‌బాస్‌ అంటే బూతుల షో అంటూ మండిపడ్డారు. ఆయన మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఈ షో అంటే అసలు పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సింగర్‌ స్మిత చేరారు.

చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్‌ షాక్‌.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్‌

ఈ షోపై తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షో అసలు నచ్చదంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె బిగ్‌బాస్‌ షోపై స్పందించారు. బిగ్‌బాస్‌ నుంచి ఎప్పుడైనా పిలుపు వచ్చిందా? అని ఆమెను అడగ్గా.. ‘బిగ్‌బాస్‌.. నాకస్సలు నచ్చని షో ఇది. ఒకవేళ బిగ్‌బాస్‌ ఆఫర్‌ వస్తే పొరపాటున కూడా అంగీకరించి ఆ తప్పు చేయను. అన్ని రోజులు కుటుంబాన్ని వదలి వెళ్లాల్సిన అవసరం ఏముంది. నెలల పాటు సెలబ్రెటీలను లాక్‌ చేసి తన్నుకొండి.. మేం టీఆర్పీలు పెంచుకుంటాం అనడం ఎంతవరకు కరెక్ట్‌. అందుకే ఈ షోని అసలు చూడను. చూసినా నాకది అర్థం కాదు. నేను మాత్రం ఈ షోకు చచ్చినా వెళ్లను’ అన్నారు.

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌ స్టార్‌?

అలాగే ‘నా సన్నిహితులు, స్నేహితులు ఎవరైనా వెళ్తా అన్న కూడా మీకు ఎమోచ్చిందని వారిస్తాను. ఇక వెళ్లిన వాళ్ల గురించి నేను ఏం అనను. అది వారి వ్యక్తిగత నిర్ణయం. ఈ సీజన్‌లో నాకు తెలిసి వాళ్లు వెళ్లారు. ఇప్పుడు దీని గురించి నేను ఏం మాట్లాడినా అది వారిని విమర్శించినట్లు అవుతుంది. అందుకే ఈ షో గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని అన్నారు. కాగా స్మీత ప్రస్తుతం జీతెలుగులో వస్తున్న సరిగమప సింగర్‌ ఐకాన్‌కు షోకు జడ్జీగా వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే షోలో కంటెస్టెంట్‌కు మెంటర్‌గా ఉన్న రేవంత్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో అడుగుపెట్టిన విషయం విధితమే.

మరిన్ని వార్తలు