సింగర్‌ సునీత వెడ్డింగ్‌.. సుమ డాన్స్‌ అదరహో

26 Jan, 2021 13:58 IST|Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. ఈ వివాహ వేడుక‌లో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా పాల్గొని వ‌ధూవ‌రులను ఆశీర్వ‌దించారు. ఇక పెళ్లి తర్వాత సింగర్‌ సునీత మరింత బిజీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ బిజినెస్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎక్కువ సమయాన్ని భర్త రామ్‌ వీరపనేని,  కుటుంబ సభ్యులతో గడపడానికే  కేటాయించింది. 

ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సునీత.. తన పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అలాగే  ప్రీ వెడ్డింగ్‌, మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆ సమయంలో ఈ వీడియోలో ఎంత వైరల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సునీత మ‌రో వీడియోను రిలీజ్ చేశారు.

సునీత‌ రామ్ వీర‌ప‌నేని వెడ్డింగ్ ఫిల్మ్ టీజ‌ర్ పేరుతో వ‌చ్చిన ఈ వీడియోలో పెళ్లి రోజు ఆమె ఇంట్లో జ‌రిగిన హ‌డావిడి ఉంది. తన ఇద్దరి పిల్లలతో సునీత ఆడుకోవడం, రింగులు మార్చుకోవడం, మెహందీ ఫంక్ష‌న్, హ‌ల్దీ ఫంక్ష‌న్‌లో జరిగిన సందడిని చూపించారు. రేణు దేశాయ్‌తో పాటు ఆమె కుమార్తె ఆధ్య కూడా ఈ వీడియోలో క‌నిపించారు. ప్రముఖ యాంకర్‌ సుమ అయితే మెహందీ పెట్టుకొని మరీ డాన్స్‌ చేసింది. ఇక సునీత నవ్వులు ఈ వీడియోకి హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.  సునీత తన అఫీషియల్ యూ ట్యూబ్‌ ఛానెల్‌లోనే ఈ వీడియోను విడుదల చేసింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు