ఫొటో వైరల్‌: కల్లు గ్లాసుతో సింగర్‌ సునీత!

5 Mar, 2021 16:51 IST|Sakshi

సింగర్‌ సునీతకు రెండో పెళ్లి ఫిక్సయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడిపిన ఆమె ఇటీవలే వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని పెళ్లాడి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తోన్న ఆమె ఈ మధ్యే మాల్దీవులకు కూడా వెళ్లి వచ్చింది. ఇదిలా వుంటే తాజాగా సునీత కల్లు గ్లాసు పట్టుకున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఓ రిసార్టులో కల్లుగీత కార్మికుడు కల్లు కుండను పట్టుకుని ఉండగా పక్కన ఉన్న మహిళలతో పాటు సునీత చేతిలో కూడా కల్లు గ్లాసు ఉంది. దీంతో ఆమె జస్ట్‌ గ్లాసుతో ఫొటోకు పోజిస్తుందని కొందరు, కాదు, రుచి చూసి ఉంటుందేమోనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది నీరా కూడా అయి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

కాగా రామ్‌ వీరపనేని తన లవ్‌స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సునీతను అర్ధాంగిగా పొందేందుకు ఏడేళ్లు నిరీక్షించానని పేర్కొన్నాడు. ఆమెను ఏడేళ్లుగా ఇష్టపడుతున్నప్పటికీ నేరుగా ఈ విషయాన్ని సునీతతో చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. కానీ లాక్‌డౌన్‌లో ఆమెకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజ్‌ చేశాడు. దీంతో కొంత షాకైన సునీత తర్వాత ఆలోచించి అతడిని కలిసి మాట్లాడి పెళ్లికి ఓకే చెప్పింది. అలా శంషాబాద్‌లోని ఓ ఆలయంలో జనవరి 9న వీరి వివాహం జరిగింది.

చదవండి: రామ్‌ ‘ఇంకేంటీ’ అంటే అర్థం చేసుకోలేకపోయా: సునీత

గురువు మృతి: సింగర్‌ సునీత భావోద్వేగం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు