భర్తతో పాటు వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సింగర్‌ సునీత

29 Jun, 2021 20:41 IST|Sakshi

సింగర్‌ సునీత..కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. తన గాత్ర మాధుర్యంతో ఎంతోమందిని కట్టిపడేసిన సునీత అందానికి కూడా అంతేమంది అభిమానులున్నారు. స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత. ఇక ఇటీవల రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సునీత కొత్త జీవితాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆమెకు కు సంబంధించి ఏదో ఓ వార్త హైలైట్‌ అవుతూనే ఉంది.

ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లు, టీవీ షోలలో పాల్గొనడంతో వీరి పెళ్లి పలు చర్చలకు దారితీసింది. తాజాగా భర్త రామ్‌ వీరపనేనితో కలిసి బిజినెస్‌లోకి ఎంటర్‌ అవ్వాలని భావిస్తుందట సునీత. ఇప్పటికే రామ్‌ మ్యాంగ్‌ వీడియోస్‌తో పాటు మరికొన్ని డిజిటల్‌ చానల్స్‌కు హెడ్‌గా నిర్వహిస్తున్నారు. తాజాగా సునీతతో కలిసి మ్యాంగో బ్యానర్‌పై వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్‌ చేసినట్లు సమాచారం.

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెబ్‌సిరీస్‌లకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రసత్తుం ఓటీటీ కంటెంట్‌ ప్రభావం నేపథ్యంలో పెద్ద సినిమాలు సైతం డిజిటల్‌ ఫ్లాట్‌పాంలలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సునీత 'పాడుతా తీయగా’ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. 

చదవండి :
ఈ ఏడాదైనా స్టార్‌ హీరోల దర్శనం దొరికేనా?

భర్తతో క్యాండిడ్‌ ఫోటోను షేర్‌ చేసిన సింగర్‌ సునీత

రామ్‌ అలా ప్రపోజ్‌ చేశాడు : సింగర్‌ సునీత 

మరిన్ని వార్తలు