సింగర్‌ సునీత : ఇంట్రస్టింగ్‌ ఫోటో, వీడియో

15 Feb, 2021 09:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు మాల్దీవుల్లో విహరించేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్‌ సునీత కూడా తమ హాలిడే స్పాట్‌గా మాల్దీవులకే సై అన్నట్టున్నారు. వాలెంటైన్స్‌డే సందర్బంగా తన  భర్త రామ్‌తో కలిసి ప్రకృతి  సోయగాలను ఎంజాయ్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌ అంటూ సునీతరామ్‌ ఒక ఆసక్తికరమై ఫోటోను  ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.  అయితే ఎక్కుడున్నదీ మాత్రం రివీల్‌ చేయలేదు.  (సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్‌ప్రైజ్‌)

అంతేకాదు ‘‘అభి న జావో ఛోడ్‌ కర్‌..కే దిల్‌ అభీ భరా నహీ..’’ బాలీవుడ్‌ మెలోడీని హమ్‌ చేస్తూ ఒక బ్యూటిఫుల్‌ వీడియోను కూడా షేర్‌ చేయడం విశేషం.  అయితే మోడ్రన్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్న సునీత సర్‌ప్రైజింగ్‌ ఫోటో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్ చూసి సునీతరామ్‌ మాల్దీవుల్లో ఉన్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరిన్ని ఫోటోలు, వీడియోలతో దీనిపై సునీత క్లారిటీ ఇస్తారా.. చూద్దాం..!!


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు