సింగర్‌ సునీత రెండో పెళ్లిపై మళ్లీ రూమర్లు

29 Nov, 2020 18:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సింగ‌ర్‌గా, టెలివిజన్‌ యాంకర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా  సినీ పరిశ్రమలోప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె.  సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. 

19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చాలా ఏళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఆయనతో విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాజాగా సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ‌డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మ్యాన్ ని సునీత‌ వివాహం చేసుకోనుంద‌ని,  ఆ వ్య‌క్తికి కూడా ఇది రెండో వివాహ‌మేన‌ని అంటున్నారు. కాగ, రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాలపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు