ఆ డైరెక్టర్‌ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత

4 May, 2021 16:58 IST|Sakshi

టాలీవుడ్‌లో సింగర్‌ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు.. టాలీవుడ్‌ ఏ సింగర్‌ లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్‌ వీరపనేనిని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నలామె ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తోంది.

ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ సునీత తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తను ఓ సినిమాకు డబ్బంగ్‌ చెబుతున్న సయమంలో ఆ డైరెక్టర్‌ తనతో వ్యవహరించిన తీరుకు షాకయ్యానంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘మొదట నేను డబ్బింగ్‌ స్టూడియోలో అడుగుపెట్టాగానే ఆ మూవీ డైరెక్టర్‌ హాలో మేడమ్‌ అంటూ నన్ను పలకరిస్తూనే నా అభిమానిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఆయన నన్ను సునీత అని పిలవడం స్టార్ట్‌ చేశారు.

అలా కొన్ని డబ్బింగ్‌ సెషన్స్‌ అయ్యాక ఆ డైరెక్టర్‌ నాకు పలు సలహాలు ఇస్తూ మధ్యలో అరేయ్‌, కన్నా, బుజ్జి అని పిలవడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అలా మాటల మధ్యలో నన్ను ఎప్పుడు మేడం అని పిలుస్తూనే.. వెంటనే అరేయ్‌, బుజ్జి అంటూ పిలిచేవారు. అది నాకు కాస్తా చిరాగ్గా అనిపించేది. ఇక నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆయన్ను కలిసే అవకాశం రాలేదు. అప్పటికే ఆ సినిమా అయిపోంది. అయితే అప్పుడు ఈ సంఘటన నాకు ఆశ్చర్యం అనిపించిన ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వోస్తుంది’ తనకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకుంది. కాగా సునీత ఆ డైరెక్టర్‌ ఎవరనేది మాత్రం చెప్పలేదు. కనీసం ఒక హింట్‌ కూడా ఆమె ఇవ్వలేదు.

చదవండి: 
అన్నింటిని సహించాను.. భరించాను: సునీత
ఎలాగు వారిని తీసుకురాలేము, కానీ మరొకరు అలా..: అనుష్క

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు