మ్యూజిక్‌ ఇన్‌ద ఫ్యామిలీ: సింగర్‌ సునీత ఆనందం

20 Mar, 2021 11:59 IST|Sakshi

సాక్షి,  హైదరాబాద్‌ : స్టార్‌ సింగర్‌ సునీత కుమార్తె  శ్రేయ  గాయనిగా కరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు  సిద్ధమవుతున్నారు.  ఈక్రమంలో   తన కృషిని సాగిస్తున్నారు. తాజాగా తన  డాటర్‌ శ్రేయ పాడిన  ఒక మెలోడీ సాంగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గిటారు వాయిస్తూ శ్రేయ అద్భుతంగా పాడిన..విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో సిధ్‌ శ్రీరాం ఆలపించిన ‘కడలల్లే వేచే పాట’ బిట్‌ను మ్యూజిక్‌ ఇన్‌ ద ఫ్యామిలీ అంటూ  తన పుతత్రికోత్సాహాన్ని ఇన్‌స్టాలో  రెండు రోజుల  క్రితం షేర్‌ చేశారు. అంతే..శ్రేయ  గాత్రాన్ని,ఆమె టాలెంట్‌ను ఫ్యాన్స్‌ అభినందనల్లో ముంచెత్తుతున్నారు.  తల్లి సునీత వాయిస్‌లా  కాకుండా వెస్ట్రన్‌ టచ్‌తో ఉండే శ్రేయ గాయనిగా  మరింత రాణించాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకుఈ వీడియో లక్షా, 37 వేలకుపైగా  లైక్స్‌ను సాధించడం విశేషమే కదా.

కాగా నేపథ్య గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సునీత, వ్యాపారి రామ్‌ వీరపనేనితో ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సునీత‌కు ఇప్పటికే  ఒక అబ్బాయి, అమ్మాయి  ఉన్నారు. ఈ ఇద్ద‌రు సంగీతంపై ఆస‌క్తిని చూపుతున్న‌ట్లు సునీత కూడా ప‌లు సంద‌ర్భాల్లో  వెల్లడించిన సంగతి తెలిసిందే. 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు