'చేతిలోన చెయ్యేసి చెప్పేయవా' అంటూ.. ఫోటో వైరల్‌

9 Jul, 2021 13:08 IST|Sakshi

ప్రముఖ సింగర్‌ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగ‌ర్‌గా, టెలివిజన్‌ యాంకర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన గాత్ర మాధుర్యంతో ఎంతోమందిని కట్టిపడేసిన సునీత అందానికి కూడా అంతేమంది అభిమానులున్నారు. స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత. ఇక ఇటీవల రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తుంది. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.


ఇక అప్పటినుంచి ఆమెకు కు సంబంధించి ఏదో ఓ వార్త హైలైట్‌ అవుతూనే ఉంది. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లు, టీవీ షోలలో పాల్గొనడంతో వీరి పెళ్లి పలు చర్చలకు దారితీసింది. సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే సునీత తాజాగా ఓ ఫోటోను షేర్‌ చేసుకుంది. భర్త చేతిలో చెయ్యేసి ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్‌చల్‌ అవుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సునీత త్వరలోనే వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సునీతతో ఒక వెబ్‌ సిరీస్‌ నిర్మించేందుకు ఆయన భర్త సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో సునీత నటిస్తారా లేదా ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసుకుంటారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు