సింగర్‌ సునీత గురువు కన్నుమూత

4 Feb, 2021 13:10 IST|Sakshi

అమృతం లాంటి గాన మాధుర్యం సింగర్‌ సునీత సొంతం. పలకడానికే కష్టంగా ఉండే లైన్లను కూడా ఆమె ఏమాత్రం తత్తరపాటు లేకుండా అవలీలగా పాడేసి సింపుల్‌ అనిపించేస్తుంది. ఆమె పాడితే పాటకే అందం వస్తుంది. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఉండటం వల్లే ఆమె ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా విరాజిల్లుతోంది. కాగా తనకు ఈ సరిగమలు నేర్పించిన గొంతు అకస్మాత్తుగా మూగబోయింది. తన సంగీత గురువు పెమ్మరాజు సూర్యారావు కన్నుమూశారు.

ఈ విషయాన్ని సునీత సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. "పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉంది" అని రాసుకొచ్చింది. ఈ మేరకు ఆయన ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: సింగర్‌ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్‌)

కాగా ఎన్నో ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఈ మధ్యే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను సైతం ఆమె తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇక పెళ్లి తర్వాత తొలిసారిగా భర్తతో కలిసి దిగిన ఫొటోను బుధవారం షేర్‌ చేసింది. (చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను)

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

మరిన్ని వార్తలు