అన్నింటిని సహించాను.. భరించాను: సునీత

8 Mar, 2021 16:58 IST|Sakshi

తన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాని.. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని అయితే వాటన్నింటినీ పునాదిరాళ్లుగా మార్చుకుని జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ప్రముఖ గాయని సునీత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మెసేజ్‌ చేశారు సునీత. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లకు ప్రతి రూపంగా నిలిచింది ఈ సందేశం. 

ఈ  క్రమంలో సునీత.. ‘‘నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్‌ చేస్తారు. నన్ను ప్రతిసారీ కిందకు లాగుతుంటారు. నాలో అభద్రతాభావాన్ని నెలకొల్పుతుంటారు. ఏదో ఒక విషయంలో నన్ను తప్పని నిరూపించాలని ప్రయత్నిస్తారు.. మీరు ఎప్పుడు నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు. ఆఖరికి నేను చెప్పేది కూడా వినరు. నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి నవ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారా!?’’ అంటూ మెసేజ్‌ చేశారు. 

‘‘నేను మీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను! ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లేనే పునాదులుగా మార్చుకుని నా బలాన్ని మరింత పెంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరునవ్వుతో అన్నింటినీ క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని.. అన్నింటినీ సహించాను.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని సునీత పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సెలబ్రిటీలు అంటే ట్రోలింగ్‌ తప్పదు. అయితే సునిత విషయంలో ఇది చాలా ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఆమె రెండో వివాహం చేసుకున్న నాటి నుంచి విమర్శించే వారు అధికమయ్యారు. ఈ నేపథ్యంలో వారందరిని ఉద్దేశించి సునీత ఇలా వ్యగ్యంగా మెసేజ్‌ చేశారు.
 

చదవండి: 
సింగర్‌ సునీత : ఇంట్రస్టింగ్‌ ఫోటో, వీడియో
సింగర్‌ సునీత పెళ్లి: కత్తి మహేష్‌ కామెంట్స్‌

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు