ఒకే పాత్రతో రూపొందిన సినిమా.. ‘హలో మీరా’

24 Oct, 2022 12:01 IST|Sakshi

ప్రముఖ దర్శకులు బాపుగారి వద్ద పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహించిన చిత్రం ‘హలో మీరా’. గార్గేయి యల్లాప్రగడ లీడ్‌రోల్‌లో నటించారు. జీవన్‌ కాకర్ల సమర్పణలో లూమియర్‌ సినిమా బ్యానర్‌పై డా.లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

‘‘ఒకే ఒక పాత్రతో ఒక రోజులో జరిగే కథతో రూపొందిన చిత్రమిది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ ప్రయాణంలో చోటు చేసుకునే పరిణామాలు ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.చిన్న, కెమెరా: ప్రశాంత్‌ కొప్పినీడి, లైన్‌ ప్రొడ్యూసర్‌: అనంత శ్రీధర్‌. 

మరిన్ని వార్తలు